అడ్డగూడూరు 26 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:-జిల్లా న్యాయసేవాధికార ఆదేశానుసారం మండల లీగల్ సర్వీస్ అథారిటీ (ఎంఎల్ఎస్సి) రామన్నపేట ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (డి)రేపాక స్కూల్ ఆవరణలో బాలల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య హాజరై ప్రసంగించారు. విద్యార్థులు బడిలో ఉన్నప్పుడే వారి హక్కులు రక్షింపబడతాయని పిల్లలే తమ నిజమైన సంపద మరియు దేశ సంపద అని తల్లిదండ్రులు గుర్తించినప్పుడే విద్యార్థుల భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్ద టానికి అవకాశం ఉంటుందని అన్నారు. స్థానిక పాఠశాల హెచ్ఎం మండల విద్యాధికారి అడ్డగూడూరు ఎన్ సబిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఏజిపి శ్రావణ్ రామన్నపేట, ఫ్యానల్ అడ్వకేట్లు కూనూరు శ్రీనివాస్ గడ్డం నరసింహ మాట్లాడుతూ..బాల్య వివాహాల నిర్మూలన,డ్రగ్స్, గంజాయి,పోక్సో,రవాణా చట్టాలు,మరియు సైబర్ నేరాలు మీద,వివిధ టోల్ ఫ్రీ (2098,108,112,100,) నంబర్ల మీద అవగాహన కల్పించారు.అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ సభ్యులు కానుగంటి శ్రీశైలం,లీగల్ సర్వీస్ ప్రతినిధి కురిమేటి యాదయ్య జెడ్పిహెచ్ఎస్(సిపిఓ) ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే నర్సయ్య,ఏఏపీసి చైర్మన్ సూరారం స్వాతి,ఉన్నత పాఠశాల,ప్రాథమిక పాఠశాల,ఉపాధ్యాయ ఉపాధ్యాయినీ బృందం మరియు విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ల్లా న్యాయసేవాధికార ఆదేశానుసారం మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఎంఎల్ఎస్ సి రామన్నపేట ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(డి) రేపాక స్కూల్ ఆవరణలో బాలల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య హాజరైప్రసంగించారు. విద్యార్థులు బడిలో ఉన్నప్పుడే వారి హక్కులు రక్షింపబడతాయని పిల్లలే తమ నిజమైన సంపద మరియు దేశ సంపద అని తల్లిదండ్రులు గుర్తించినప్పుడే విద్యార్థుల భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దటానికి అవకాశం ఉంటుందని అన్నారు. స్థానిక పాఠశాల హెచ్ఎం మండల విద్యాధికారి అడ్డగూడూరు ఎన్ సబిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఏజిపి శ్రావణ్ రామన్నపేట, ఫ్యానల్ అడ్వకేట్లు కూనూరు శ్రీనివాస్ గడ్డం నరసింహ మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిర్మూలన,డ్రగ్స్, గంజాయి,పోక్సో,రవాణా చట్టాలు,మరియు సైబర్ నేరాలు మీద వివిధ టోల్ ఫ్రీ (2098,108,112,100,) నంబర్ల మీద అవగాహన కల్పించారు. అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ సభ్యులు కానుగంటి శ్రీశైలం, లీగల్ సర్వీస్ ప్రతినిధి కురిమేటి యాదయ్య జెడ్ పి హెచ్ఎస్(సిపిఓ) ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే నర్సయ్య, ఏఏపీసి చైర్మన్ సూరారం స్వాతి, ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల,ఉపాధ్యాయ ఉపాధ్యాయినీ బృందం మరియు విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.