అడ్డగూడూరు 26 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అడ్డగూడూరు మండల కేంద్రంలో అధ్యక్షులు లింగాల నర్సిరెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్"బి.ఆర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద డాక్టర్"మన్మోహన్ సింగ్ జయంతి మరియు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.మాజీ ప్రధాని డాక్టర్"మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా లింగాల నర్సిరెడ్డి మాట్లాడుతూ..భారత ఆర్థిక ప్రగతికి దారి చూపిన మహానీయుడని,ప్రముఖ ఆర్థికవేత్త అని,మేధావి,నిష్కలంక రాజకీయ నాయకుడు అని దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టడంలో భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వేదికపై మరింత బలమైన దేశంగా నిలపడంలో డాక్టర్"మన్మోహన్ సింగ్ విశిష్టమైన పాత్ర పోషించారు.అని ప్రజాస్వామ్య విలువల పట్ల అంకితభావం అయిన జీవితానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచాయి అని అన్నారు.తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు.చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూమికోసం..భుక్తి కోసం..ఆత్మగౌరవం కోసం..విముక్తి కోసం అమ్మ చేసిన పోరాటాలు ధైర్య సాహసాలు ఎప్పుడు స్ఫూర్తి దాయకమని కొనియాడారు. బడుగు,బలహీన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటాలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.