రవి మహల్ నందు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చే గోమాత మహత్యం పై ఆధ్యాత్మిక ప్రవచనం
సూర్యాపేట సూర్యాపేట సేవ మరియు ఆధ్యాత్మిక మిత్ర మండలి ఆధ్వర్యంలో అక్టోబర్ ఒకటవ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు సూర్యాపేట రవి మహల్ నందు ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చే గోమాత మహత్యంపై ఆధ్యాత్మిక ప్రవచనం కార్యక్రమం నిర్వహించ బడుతుందని సూర్యాపేట సేవ మరియు ఆద్యాత్మిక మిత్రమండలి అద్యక్షులు బొమ్మిడి అశోక్ అన్నారు. ఈ కార్యక్రమం ఖచ్చితంగా సమయానికి ప్రారంభం అవుతుంది , కాబట్టి పట్టణ ప్రజలు ముందుగానే సభా వేదికకు చేరుకోవాలని తెలిపారు. పైన హాలు నిండిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోను లోపలికి అనుమతించబడదని, హాల్ నిండిన తర్వాత కింద డైనింగ్ హాలు మరియు బయట ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ ల ద్వారా కార్యక్రమాన్ని వీక్షించవచ్చని చెప్పారు. చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను ప్రత్యక్షంగా వీక్షించాలంటే ముందుగానే రావాలని తర్వాత వచ్చి నిర్వాహకులను ఇబ్బంది పెట్టవద్దని వారు తెలిపారు. అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రసంగము గోమాత మీద మనము కనివిని ఎరగని రీతిలో లో ఈ ప్రసంగం ఉండబోతుంది కాబట్టి సూర్యాపేటలోని ఆధ్యాత్మికవేత్తలు ప్రముఖులు ఈ కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేయాలని వారు తెలిపారు. తాము అడగగానే రవి మహల్ ను ఉచితంగా అందిస్తున్న కర్నాటి రవికి , మరియు a3 యాడ్ ఏజన్సి ప్రసన్న కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట సేవా మరియు ఆధ్యాత్మిక మిత్రమండలి కార్యదర్శి వీరవల్లి విజయశంకర్, కోశాధికారి నూకల శైలేందర్, సభ్యులు కర్నాటి రవి, వాస చంద్రశేఖర్,, గుండా సృజన్, బొమ్మిడి సంతోష్, ఇమ్మడి సందీప్, బేతు కిషోర్, కడుదుల రోహిత్ తూముల ప్రవీణ్, బొడ్డు శంకర్ తదితరులు పాల్గొన్నారు.