ప్రపంచ చెవిటి దినోత్సవం సందర్భంగ ప్రత్యేక వైద్య ఆరోగ్య శిబిరం
డిఎంహెచ్వో డా. సంధ్యా కిరణ్మయి.
జోగులాంబ గద్వాల 26 సెప్టెంబర్ 226 తెలంగాణవార్తా ప్రతినిధి:- ప్రపంచ చెవిటి దినోత్సవం సందర్భంగ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ (DLSA) ఆధ్వర్యంలో, సివిల్ జడ్జి నిషిక పోద్రుదే సమన్వయంతో చెవిటి మరియు మూగ విద్యార్థుల కోసం శనివారం ప్రత్యేక వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. జోగులాంబ గద్వాల్ పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో ఉన్న *రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ (రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ది బ్లైండ్)*లో ఈ శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖకు చెందిన వైద్యురాలు, డాక్టర్ ప్రియాంక మరియు పారా మెడికల్ సిబ్బంది శిబిరంలో పాల్గొని లబ్ధిదారులకు అవసరమైన వైద్య సేవలను అందించడం జరిగింది. శిబిరంలో లబ్ధిదారులకు ప్రాథమిక ఆరోగ్య పరిక్షలు, వైద్య పరిక్షలు, వైద్య సంప్రదింపులు నిర్వహించడంతో పాటు అవసరమైన మందులను అందించారు. ఆరోగ్య సమస్యలను గుర్తించి, అవసరమైన వారికి తదుపరి వైద్య సేవలు పొందేలా సిబ్బంది సూచనలు అందించారు.