జోగులాంబ గద్వాల 26 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఇటిక్యాల . మండలం కేంద్రం ఇటిక్యాల గ్రామం లోని ఐలమ్మ (దిమ్మె కట్ట) దగ్గర మై రాముడు ఎక్స్ ఆర్మీ ముఖ్యఅతిథిగా చాకలి కృష్ణ మరియు చాకలి మౌలాలి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జరుపుకున్నారు. ఎక్స్ ఆర్మీ మై రాముడు మాట్లాడుతూ నాటి నిజాం నిరంకుశత్వం భూస్వాముల అనిచివేత మరియు జమిందార్ల దోపిడీని వ్యతిరేకిస్తూ తెలంగాణ పోరాటంలో అమరత్వం శక్తిగా నిలిచిన వీరనారి. జమీందారులు ఏ భాష ఉపయోగిస్తే ఆ భాష ఉపయోగించిన వీరనారి చాకలి ఐలమ్మ అమర్ రహే అమర్ రహే అని నినాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్.వి.ఆర్ l స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అలాగే గ్రామస్తులు మోషన్న, పెద్ద ఏసన్న, ఆదాము, టైలర్ దావీదు చాగపురం దాసన్న హోటల్ స్వామి దాస్, చాకలి మద్దిలేటి, బోయ వెంకట్ రాముడు,జిరాక్స్ మునెన్న, వెంకటేశ్, లక్ష్మీనారాయణ, తలారి బజారన్న, ముస్లిం పెద్దయ్య, మొదలగు వారు పాల్గొన్నారు,