తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం..
చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి నివాళులర్పించిన బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి
బాసు హనుమంతు నాయుడు _
జోగులాంబ గద్వాల 26 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, బహుజన ఆత్మ గౌరవ ప్రతీక, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి,బాసు హనుమంతు నాయుడు పూలమాలవేసి నివాళులర్పించారు.. అనంతరం,చాకలి ఐలమ్మ కమిటీ సభ్యులు వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి రాచరిక పాలనలో,తెలంగాణ రైతాంగ న్యాయమైన హక్కులకోసం, ధిక్కార స్వరం వినిపించిన ధీర వనిత,అణచివేతకు గురవుతున్న సబ్బండ కులాల ఆత్మగౌరవ ప్రతీక, ఐలమ్మ అని కొనియాడారు. నాటి భూస్వాములను ఎదురించి ధిక్కార స్పూర్తినీ,నాటి చట్టాల పరిధిలో న్యాయస్థానంలోనూ పోరాడి గెలిచి ప్రజాస్వామిక స్పూర్తినీ,ప్రదర్శించిన ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శనీయమన్నారు.శాంతియుత పంథాలో కేసీఆర్ గారు ప్రారంభించిన మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో, ఐలమ్మ అందించిన స్పూర్తి ఇమిడి వున్నదని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు చాటేందుకు నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం, వారి జయంతిని అధికారింకగా నిర్వహించే సాంప్రదాయాన్ని నెలకొల్పిందని అన్నారు. ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగా,నాటి బిఆర్ఎస్ పదేండ్ల ప్రగతి ప్రస్థానంలో, మహిళలు శిశు సంక్షేమం, రైతాంగం సబ్బండ కులాల అభ్యున్నతి కోసం అనేక వినూత్నపథకాలను అమలు చేశామన్నారు.అదే దిశగా, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన పాలనా పద్ధతులను మొదటి పాలనా ప్రాధాన్యతలుగా, చిత్త శుద్ధితో అమలు చేయడం ద్వారా మాత్రమే, చాకలి ఐలమ్మ గారికి మనం నిజమైన నివాళులు అర్పించిన వారమవుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జి.రాఘవేంద్ర రెడ్డి, అల్లపాడు ప్రతాప్, మోనేష్ మరోజు, వెంకటేష్ నాయుడు, రాజారెడ్డి, సి.కె.రంగన్న, చక్రిధర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శేఖర్ నాయుడు, డ్యామ్ శ్రీను, రమేష్, చంద్రశేఖర్, రాముడు, మల్లికార్జున్, మహేందర్, రామంజి, శ్రీను, మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు...