🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 25 September 2026, 6:37 pm Posted by : Telangana Vaartha

ఘనంగా అమరవాది శ్రావణ్ జన్మదిన వేడుకలు.

News Image
శుభాకాంక్షలు తెలిపిన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,
తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.
సూర్యాపేట, 25 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అమరవాది శ్రావణ్ జన్మదిన వేడుకలను శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ అమరవాది శ్రావణ్ కు శాలువాకప్పి సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. అమరవాది శ్రవణ్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. సమాజ సేవలో సైతం ముందుండి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తమకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి అమరవాది శ్రావణ్ కృతజ్ఞతలు తెలిపారు.
🏠 Home