పుట్టి పెరిగిన గ్రామం లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం నా యొక్క బాధ్యతగా భావిస్తున్నాను
పుట్టి పెరిగిన గ్రామం లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం నా యొక్క బాధ్యతగా భావిస్తున్నానని రాష్ట్ర పౌరసరఫరాలు మరియు నీటిపారుదల శాఖ మాత్యులు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ తో కలిసి తిరుమలగిరి మండలం తాటిపాములలో రూ.5 కోట్ల సీఎస్ఆర్ నిధులతో జెడ్పీ హైస్కూల్ బలోపేతం పనులకు, రూ.2 కోట్ల జెన్ కో నిధులతో ప్రైమరీ స్కూల్ బలోపేతం పనులకు శంకుస్థాపన చేశారు. తదనంతరం రూ.16 కోట్లతో యశ్వంత్పూర్ వాగుపై నిర్మిస్తున్న చెక్ డ్యామ్– కమ్– బ్రిడ్జి పనులను పరిశీలన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామం లో మెరుగైన విద్య అందించడానికి 7 కోట్ల నిధులతో హైస్కూల్, ప్రైమరీ స్కూల్ లో అదనపు గదులు నిర్మించడం జరుగుతుందని, ఇట్టి పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వీలైనంత త్వరగా ఒక సంవత్సరంలోపు పూర్తి చేసి ఇవ్వాలని గుత్తందారులను మంత్రి ఆదేశించారు. అలాగే గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేవని మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా, వెంటనే మంత్రి ఒక్కొక్క అంగన్వాడి కేంద్రంనకు 20 లక్షలు చొప్పున మొత్తం 4 అంగన్వాడి సెంటర్లకు 80 లక్షలు మంజూరు చేసి మంచి నాణ్యతతో చుట్టూ ప్రహరీ గోడ, టాయిలెట్స్ తో ఆధునిక పద్ధతిలో అంగన్వాడి కేంద్రాలను నిర్మించాలని అన్నారు. రూ.16 కోట్లతో యశ్వంత్పూర్ వాగుపై నిర్మిస్తున్న చెక్ డ్యామ్–కమ్–బ్రిడ్జి పనులను పరిశీలన చేసిన మంత్రి పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని, దేవాదుల ప్రాజెక్టు పూర్తిచేసి తుంగతుర్తి నియోజకవర్గానికి నీరు అందిస్తామని అలాగే సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని మంత్రి అన్నారు.
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యూల్ మాట్లాడుతూ రాబోవు రోజులలో తుంగతుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు రోడ్లు, అంగన్వాడీ కేంద్రాలు, స్త్రీ శక్తి భవనాలు పాఠశాలకు పక్క భవనాలు నిర్మించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కె నరసింహ,
సూర్యాపేట మార్కెట్ చైర్మన్ వీణా రెడ్డి, ఆర్డిఓ వేణుమాధవ్, డి సీసీ ప్రెసిడెంట్ గుడిపాటి నరసయ్య, సర్పంచ్ కిషన్
ప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు
గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు