జోగులాంబ గద్వాల 23 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- నియోజకవర్గ ప్రజలకు రేషన్ బియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు మొత్తం 14 కొత్త రేషన్ షాపులను ఏర్పాటు చేసి డీలర్లను నియమించినట్లు తెలిపారు. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో మాట్లాడి ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా కొత్త రేషన్ షాపుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో రేషన్ షాపుల డీలర్ల నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించగా, నియమితులైన డీలర్లకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను బుధవారం శాంతినగర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. కొత్త రేషన్ షాపుల ద్వారా అలంపూర్ నియోజకవర్గంలోని ప్రజలకు రేషన్ సరుకుల పంపిణీ మరింత సులభతరం కానుందని తెలిపారు.