ముందస్తు అరెస్టులు.
కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వానికి నిదర్శనం.
ఇటిక్యాల మండలం బిజెపి పార్టీ అధ్యక్షులు అబ్దుల్లా.
జోగులాంబ గద్వాల 22 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతి నిధి:- జోగులాంబ గద్వాల జిల్లా జీవనాడి అయిన జూరాల ప్రాజెక్టు వద్ద పరిస్థితులను పరిశీలించి, రైతుల సమస్యలను తెలుసుకునేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పర్యటించనున్న సందర్భంగా బీజేపీ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని ముందస్తు అరెస్టులు చేయించడం తీవ్రంగా ఖండిస్తున్నాము.
ముందస్తు అరెస్టైన బీజేపీ నాయకులు
* ఇటిక్యాల మండల అధ్యక్షులు షేక్ అబ్దుల్లా
* ఓబీసీ మండల అధ్యక్షులు కాశన్న నాయుడు
* గజేంద్ర
* జనార్ధన్
* నరేష్
* మహేష్
స్థలం: ఇటిక్యాల పోలీస్ స్టేషన్
తేదీ: 22-09-2026
రైతుల సమస్యలను తెలుసుకుని, వారి తరఫున ప్రశ్నించడానికి వచ్చే నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధమైన చర్య. రైతుల సమస్యలపై బీజేపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుంది. అని ఇటిక్యాల మండలం బిజెపి పార్టీ మండల అధ్యక్షులు అబ్దుల్లా అన్నారు.