బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్న
జోగులాంబ గద్వాల 22 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జూరాల ప్రాజెక్టు వద్ద నీళ్లు లేక ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావు ని జడ్చర్ల వద్ద పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకోవడం అప్రజాస్వామికం. రైతుల కష్టాలను తెలుసుకునేందుకు వెళ్తుంటే మార్గమధ్యంలోనే అడ్డుకోవడం ఏంటి? ఇది ప్రభుత్వ దౌర్జన్యానికి, అధికార మదానికి నిదర్శనం... రైతుల పక్షాన బీజేపీ తెలంగాణ నిలబడుతుంది. అన్నదాతల గొంతుకై నిలుస్తాం. నిలదీస్తాం. రైతుల పొలాలకు సాగునీరు ఇవ్వాలని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులకు పాల్పడటం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం. రాష్ట్రవ్యాప్తంగా ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు కరెంటు కోతలతో లక్షలాది ఎకరాల్లో పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటిని వెంటనే విడుదల చేసి, పంటలను కాపాడాల్సిన కనీస బాధ్యత ఈ ప్రభుత్వంపై లేదా? ప్రతిపక్ష నాయకులపై కక్షసాధింపు చర్యలు, అక్రమ అరెస్టులతో కాలయాపన చేయడం మానుకోవాలి. ఈ సంక్షోభ సమయంలో రాజకీయాలు పక్కనపెట్టి, యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అని బిజెపి జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు అన్నారు.