🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 21 September 2026, 7:36 pm Posted by : Telangana Vaartha

విఘ్నాలను తొలగించే దైవం గణనాధుడు : తిలక్

News Image
ఖమ్మం నగరంలో గణపతి మండపాలు భక్తులతో నిండి ఉన్నాయి. మండపాల నిర్వాహకులు అత్యంత భక్తితో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు . గణపతి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా నిర్వాహకులు అన్నదానాలు, సరస్వతి పూజలు, కుంకుమ పూజలు, పల్లకి సేవలు తదితర భక్తి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఖమ్మం నగరంలో ఈ రోజు పలు మండపాలలో స్వామివారిని దర్శించుకున్న ఖమ్మం నియోుక వర్గ 'A' బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు 3 టౌన్ కో- ఆర్డినేటర్ యర్రం బల గంగాధర్ తిలక్ ప్రజలందరు సుఖశాంతులతో ఆయురాగ్యాలతో జీవించాలని స్వామివారిని వేడుకున్నారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటుచేసిన అన్నప్రసాద వితరణను లాంచనంగా ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో గెల్లా కృష్ణ వేణి , DCC కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోజెడ్ల సత్యనారాయణ, నాయకులు అల్లెసాయి కిరణ్, మధు, రూపేష్, లోకేష్, సాహితీ గౌతమ్, సుహాస్, మంధవి, అన్వేష్ పవన్, వంశీ, వైసు, ఐశ్వర్య, బన్నీ, కార్తిక్ మండపాల నిర్వాహకులు, భక్తులు మరియు నగర ప్రముఖులు పెద్దమొత్తంలో పాల్గొన్నారు .
🏠 Home