🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 21 September 2026, 7:32 pm Posted by : A.Timma Gurudu

​హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలి

News Image
ముఖ్యమైన పాయింట్స్:సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం డిమాండ్.
జోగులాంబ గద్వాల 21 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ మరియు ఈడబ్ల్యూఎస్ వర్గాల లబ్ధిదారులకు హైకోర్టు తీర్పు మేరకు తక్షణమే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించాలని "సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం" (జోగులాంబ గద్వాల జిల్లా) అధ్యక్షులు మరియు లబ్ధిదారుల ప్రతినిధి కె. మోహన్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన "సోమవారం ప్రజావాణిలో" ఆడిసనల్ కలెక్టర్ మదన్ మోహన్ కి వినతిపత్రం సమర్పించారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గద్వాల పట్టణం, దౌదర్‌పల్లి గ్రామ శివారులోని సర్వే నెంబర్లు 968, 969, 979, 980, 983, 984, 985లలో 2013లో ‘ఇందిరమ్మ ఇండ్ల పథకం’ కింద పేదలకు పట్టా సర్టిఫికెట్లు మంజూరయ్యాయని తెలిపారు. అయితే, గత ప్రభుత్వం ఆ స్థలంలో నర్సింగ్ కళాశాల మరియు ఏరియా ఆసుపత్రి నిర్మాణాల కొరకు కేటాయించడంతో బాధితులు 2022లో గౌరవ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు.
​బాధితుల పక్షాన విచారణ జరిపిన గౌరవ హైకోర్టు, పేదలకు అనుకూలంగా తీర్పునిస్తూ... ​మొదటి విడతగా 24-04-2026 నాటి తీర్పు (W.P. No. 28124/2022) ప్రకారం లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసిందని, ​రెండవ ఉత్తర్వు (31-07-2026) ప్రకారం మిగిలిన 648 మంది లబ్ధిదారులకు కూడా న్యాయం చేయాలని ఆదేశించిందని తెలిపారు. ​హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీలను జిల్లా ఆడిసనల్ కలెక్టర్ గారికి సమర్పించినట్లు తెలిపిన ఆయన, జిల్లా యంత్రాంగం మరియు అధికారులు స్పందించి హైకోర్టు ఉత్తర్వులను త్వరితగతిన పరిశీలించి, అర్హులైన లబ్ధిదారులందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించి న్యాయం చేయాలని కోరారు.
కె. మోహన్ రావు
లబ్ధిదారుల ప్రతినిధి & అధ్యక్షులు,
సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం (Regd. No. 743/2012),
జోగులాంబ గద్వాల జిల్లా.
ఫోన్ నెంబర్: 9989714173
🏠 Home