🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 21 September 2026, 7:31 pm Posted by : A.Timma Gurudu

ప్రజావాణి కార్యక్రమంలో 10 ఫిర్యాదులు స్వీకరణ

News Image
ముఖ్యమైన పాయింట్స్:జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు
జోగుళాంబ గద్వాల 21 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు తెలిపారు. ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 10 ఫిర్యాదులు స్వీకరించి, ఆయా పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి, వారి వినతులు, ఫిర్యాదులను స్వీకరించి, అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. తద్వారా ప్రజల్లో పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం పెరుగుతుందని అన్నారు.

గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, వాటి పరిష్కార స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం వల్ల వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే అవకాశం ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. ఈ రోజు వచ్చిన ఫిర్యాదుల్లో ప్లాట్ల ఆక్రమణకు సంబంధించినది – 01, భూ వివాదాలకు సంబంధించినవి – 06, భర్త హెరాస్మెంట్ కు సంబంధించి – 01, ఇతర అంశాలకు సంబంధించినవి – 02 ఫిర్యాదులు ఉన్నాయి. అని పి ఆర్ ఓ ఆఫీసు నుంచి తెలియజేశారు.
🏠 Home