🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 21 September 2026, 7:28 pm Posted by : A.Timma Gurudu

రైతుల ధర్నాతో దద్దరిల్లిన జమ్మిచెడు

News Image
రైతులకు అండగా బిర్ఎస్ పార్టీ

రైతులకు నీరు ఇచ్చేవరకు వరకు పోరాడుతాం...

రైతులకు వెంటనే నీరు విడుదల చేయాలని,రైతులతో కలిసి,రోడ్డుపై బేటాయించి,ధర్నా చేసి,పెద్ద ఎత్తున నిరసన తెలిపిన మాజీ జడ్పీటీసీ

బాసు శ్యామల హనుమంతు నాయుడు.

జోగులాంబ గద్వాల 21 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి జిల్లా కేంద్రంలోని జమ్మి చెడు దగ్గర రైతులకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ... గద్వాల - కర్నూల్ ప్రధాన రహదారిపై పార్టీ శ్రేణులు రైతులతో కలిసి, వరి నాట్లను పట్టుకొని బేటాయించి,ధర్నా చేసి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.... 24 గంటల్లోపు రైతులకు నీళ్లు ఇస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు...._

అంతక ముందు, కలెక్టరేట్ నుంచి జమ్మిచేడు వరకు రైతులతో కలిసి ర్యాలీగా వచ్చి,కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూరాల కుడి కాలువల గేట్లను ఎందుకు మూసివేశారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బాసు శ్యామల డిమాండ్‌ చేశారు....రైతులకు తక్షణమే జూరాల నీటిని విడుదల చేయాలని కోరారు.తెలంగాణ రైతుల ప్రయోజనాలను పక్కనపెట్టి నీటిని ఆంధ్రా ప్రాంతాలకు తరలిస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర రైతుల నోట్లో మట్టి కొట్టి.. నీటిని ఆంధ్రాకు ధారాదత్తం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రపంచ పటాలు పరిశీలించండి జూరాల నుంచి నీళ్లు ఎందుకు ఇస్తలేవని వారు ప్రశ్నించారు. మీ గురువు చంద్రబాబు నాయుడు కళ్ళలో ఆనందం చూడడం కోసమా అని నిలదీశారు. పాలమూరును పండబెడుతున్న పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి అని అన్నారు. మన నీటిని వాడుకోవడానికి నిర్బంధాలా? ఎవరి కోసం మీరు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించేది అని ప్రశ్నించారు.. రాహుల్ గాంధీ కోసమా లేక చంద్రబాబు నాయుడు కోసమా అని నిలదీశారు... తక్షణమే జూరాల గేట్లను ఎత్తి రైతులకు నీళ్లు ఇవ్వాలన్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున రైతులు ఉద్యమిస్తారని.. అప్పుడు రేవంత్ సర్కార్ మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. రైతులకు జూరాల నుంచి నీటిని విడుదల చేసే వరకు బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని సృష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
🏠 Home