అడ్డగూడూరు 20 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చౌళ్ళరామారం గ్రామం స్టేజీ వద్ద కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది.ఈ ఘటనలో పోన్నం సందీప్ తండ్రి వెంకన్న అమ్మమ్మ బండారి సోమక్కా భర్త పిచ్చయ్య వయసు 70 సంవత్సరాలు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామస్తులు సుమారు సమయం ఉదయం 10.20 నిమిషాలకు హైద్రాబాద్ నుండి తిరుమలగిరి కి వెళ్తుండగా టీఎస్ 10 ఈ ఎఫ్ 9655 నెంబర్ గల కారు చౌళ్ళరామారం వద్ద అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టడం వల్ల కారు పల్టీ కొట్టింది.ఈ ఆక్సిడెంట్ లో సోమక్క తలకి గాయాలు అయినాయని ఆమెను దగ్గర్లో తిరుమలగిలోని నాగానంద హాస్పిటల్ కి తరలించడం జరిగిందని..పూర్తి వివరాలు తెలియ రావలసిన ఉందని ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.