🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 20 September 2026, 2:41 am Posted by : Telangana Vaartha

జాతీయ లోక్‌అదాలత్‌లో జోగుళాంబ గద్వాల జిల్లాకు నాలుగో స్థానం

News Image
ముఖ్యమైన పాయింట్స్:కోఆర్డినేషన్ సమావేశంలో అభినందించిన ప్రిన్సిపల్ జిల్లా జడ్జి కే. కళ్యాణ్ చక్రవర్తిలోక్‌అదాలత్ విజయవంతానికి కృషి చేసిన కోర్టు డ్యూటీ అధికారులకు ప్రశంసా పత్రాలు
జోగుళాంబ గద్వాల 19 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులో శనివారం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి శ్రీ కే. కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. న్యాయపరమైన అంశాలు, వివిధ శాఖల మధ్య సమన్వయం, పెండింగ్ కేసుల పరిష్కారం, ప్రజలకు సత్వర న్యాయం అందించే విధానాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. న్యాయశాఖతో పాటు పోలీస్, రెవెన్యూ తదితర శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించే అంశాలపై అధికారులు చర్చించారు. అనంతరం సెప్టెంబర్ 12న నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో జోగుళాంబ గద్వాల జిల్లా నాలుగో స్థానం సాధించడంపై ప్రిన్సిపల్ జిల్లా జడ్జి శ్రీ కే. కళ్యాణ్ చక్రవర్తి గారు లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయడంలో సమన్వయంతో పనిచేసిన అధికారులు, సిబ్బంది కృషిని ప్రశంసించారు. జాతీయ లోక్‌ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి కీలకంగా పనిచేసిన కోర్టు డ్యూటీ అధికారులను ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రిన్సిపల్ జిల్లా జడ్జి శ్రీ కే. కళ్యాణ్ చక్రవర్తి ప్రశంసా పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు ఐపీఎస్ లోక్‌అదాలత్ లక్ష్యాలను సాధించేందుకు అంకితభావంతో విధులు నిర్వర్తించిన అధికారుల సేవలను ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ సమావేశానికి జిల్లా అదనపు ఎస్పీ శ్రీ కే. శంకర్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీ మధుమోహన్, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ కృష్ణ, గద్వాల డీఎస్పీ శ్రీ వై. మొగిలయ్య, గద్వాల అలంపూర్ శాంతినగర్ సర్కిల్ ఆఫీసర్స్, తదితర అధికారులు హాజరయ్యారు.
🏠 Home