🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 20 September 2026, 2:02 am Posted by : Telangana Vaartha

దేశం లోనే కోదాడ జాబ్ మేళా అతి పెద్ద జాబ్ మేళా...

News Image
ముఖ్యమైన పాయింట్స్:తెలంగాణలో రైతులు భూములు అమ్ముకొని పిల్లల్ని చదివించారు....
మట్టిలో మాణిక్యాల కు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికే ఎంతో కష్టపడి జాబ్ మేళా నిర్వహించాం...

దేశంలోనే పేరుగాంచిన 350 కంపెనీలు జాబ్ మేళ లో వచ్చాయి...

30 వేల పైచిలుకు నిరుద్యోగులు జాబ్ మేళాకు తరలివచ్చారు...

తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చి తీరుతుంది....

కోదాడ హుజూర్నగర్ నియోజక వర్గాల ప్రజలే మా కుటుంబ సభ్యులు... జాబ్ మేళాలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి...

కోదాడలో నిర్వహించిన జాబ్ మేళా దేశంలోనే అతిపెద్ద జాబ్ మేళాగా నిలిచిందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలో రైతులు తమ భూములను అమ్ముకుని తమ పిల్లలను చదివించారని, వారి కష్టానికి తగిన ఫలితం దక్కేలా మట్టిలో మాణిక్యాలుగా ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఎంతో కష్టపడి ఈ జాబ్ మేళాను నిర్వహించామని తెలిపారు.కోదాడ పట్టణంలో శనివారం ఎమ్మెల్యే, జాబ్ మేళా ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ పద్మావతి రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శాసన మండలి స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, అనిల్ కుమార్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ తదితరులతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. దేశంలోనే పేరుగాంచిన 350 కంపెనీలు జాబ్ మేళాకు తరలివచ్చాయని, 30 వేల మందికి పైగా నిరుద్యోగ యువత హాజరై ఉద్యోగాల కోసం తమ అర్హతలను నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల ప్రజలే తమ కుటుంబ సభ్యులని పేర్కొన్నారు. గత 34 ఏళ్ళు గా 6సార్లు ఎమ్మెల్యే గా, రెండు సార్లు మంత్రి గా,2 సార్లు ఎంపీగా ప్రజా సేవా లో ప్రజల ఆదరాభిమానాలు పొందు తున్నఅన్నారు. ప్రస్తుతం జాబ్ మేళా లో కొందరికి ఆర్డర్లు ఇస్తున్నామని, మరి కొంత మందికి కంపెనీ లు తమ సంస్థల్లో పూర్తి స్థాయిలో ఇంటర్వ్యూలు చేసి ఉద్యోగాలు ఇస్తాయనీ, ఎవరికి ఏ సమస్య ఉన్న తన కార్యాలయం లో సంప్రదించాలన్నారు.

నిరుద్యోగ యువత జీవితాల్లో కొత్త అధ్యాయానికి కోదాడ జాబ్ మేళా నాంది.....

ప్రజా ప్రభుత్వం 60 వేల ఉద్యోగాలు కల్పించింది... గడ్డం ప్రసాద్...

కోదాడలో నిర్వహించిన మెగా జాబ్ మేళా నిరుద్యోగ యువత జీవితాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. యువతకు విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారి భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు సుమారు 60 వేల ఉద్యోగాలు కల్పించిందని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలోనూ విస్తృత అవకాశాలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కోదాడలో కనీవినీ ఎరుగని రీతిలో జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. భారీ సంఖ్యలో కంపెనీలు, ఉద్యోగ అవకాశాలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా యువతకు నేరుగా ఉద్యోగావకాశాలు పొందే అవకాశం కల్పించారని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన విద్య, ఉపాధి హక్కులను సమర్థవంతంగా అమలు చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గడ్డం ప్రసాద్ స్పష్టం చేశారు. యువత తమ విద్యార్హతలు, నైపుణ్యాలను మెరుగుపరుచుకుని అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కోదాడ హుజూర్‌నగర్ నియోజకవర్గాల అభివృద్ధికి నిరంతర కృషీవలురు ఉత్తమ్‌ పద్మావతి దంపతులు...

నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని తపన ఆ దంపతుల్లో ఉంది.... ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ.10 వేల కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్, రోడ్ల అభివృద్ధికి మంత్రి ఉత్తమ్ కృషి... శాసన మండలి చైర్మన్ స్పీకర్ గుత్తా
కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల అభివృద్ధికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి దంపతులు నిరంతరం కృషి చేస్తున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే తపన ఉత్తమ్‌,పద్మావతి దంపతుల్లో ఉందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కోదాడలో భారీ స్థాయిలో జాబ్‌మేళా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి రంగంతో పాటు రహదారుల అభివృద్ధికి సుమారు రూ.10 వేల కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కృషి చేస్తున్నారని గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. ముఖ్యంగా రైతుల పంటలను కాపాడేందుకు సాగునీటి వనరుల అభివృద్ధిపై మంత్రి నిరంతరం దృష్టి సారిస్తున్నారని అన్నారు. రైతుల ప్రయోజనాల కోసం 24 గంటలు శ్రమించే వ్యక్తిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పనిచేస్తున్నారని కొనియాడారు.
పౌరసరఫరాల శాఖ మంత్రిగా గత మూడేళ్లుగా రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకున్నారని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. రైతులకు పంటకు గిట్టుబాటు ధర, ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతుల సమగ్ర అభివృద్ధే తమ అందరి లక్ష్యమని స్పష్టం చేశారు. రైతు సంక్షేమం, సాగునీటి సదుపాయాల కల్పన, రహదారుల అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వం ముందుకు సాగుతోందని గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు మార్కెట్ కమిటీ చైర్మన్ కోదాడ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లీశ్వరి , టీ పీపీసీ కార్యదర్శి సి.హెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి బీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్, ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి , సూర్యాపేట డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న నల్లగొండ డిసిసి అధ్యక్షులు వెంకటేశ్వర్లు, కైలాష్, టూరిజం మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, కోదాడ జాబ్ మేళాలో వివిధ విభాగాల్లో బాధ్యతలు తీసుకున్న నాయకులు కేఎల్ఎం ప్రసాద్ బషీర్, ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, కోదాడ మున్సిపల్ కౌన్సిలర్లు, ఫ్లోర్ లీడర్ , కందుల కోటేశ్వరరావు, గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, ఆర్డీఓ సూర్య నారాయణ, రెవిన్యూ, పోలీస్, హెల్త్, పంచాయతీ రాజ్ సిబ్బంది, సర్పంచ్ లు వార్డు సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ, మండల శాఖ ల, మహిళా సంఘాల నాయకులు ఉన్నారు.
🏠 Home