శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఓటరు జాబితా పునఃసిద్ధీకరణకు షెడ్యూల్ విడుదల
ములుగు జిల్లా, సెప్టెంబర్ :19 భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెలంగాణ శాసన మండలిలోని పట్టభద్రుల నియోజకవర్గాల ఓటరు జాబితా పునఃసిద్ధీకరణ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు.ఓటరు జాబితా పునఃసిద్ధీకరణలో భాగంగా అర్హత కలిగిన పట్టభద్రులు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకునేందుకు నిర్ణీత గడువులోగా ఫారం 18లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఈ ప్రక్రియలో అర్హులైన గ్రాడ్యుయేట్ ఓటర్ల వివరాలతో జాబితాను సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 28నుండి నవంబర్ ఆరో తేదీ వరకూ 01/11/2026 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కనీసం 3 సంవత్సరాలు పూర్తవ్వాలిని తెలిపినారు. సాధారణ శాసనసభ/సార్వత్రిక ఎన్నికల్లాగా ఈ ఓటర్ల జాబితా శాశ్వతం కాదని ప్రతి ఎన్నికకూ మునుపటి ఓటర్ల జాబితా రద్దవుతుంది కాబట్టి గతంలో ఓటు హక్కు ఉన్నవారైనా తప్పనిసరిగా కొత్తగా ఫారం 18 ద్వార దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపినారు. అర్హత కలిగిన పట్టభద్రులు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి అధికారిక వెబ్‌సైట్ ceotelangana.nic.in ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమం ఈ విధంగా కొనసాగుతుంది.
1.ప్రజా నోటీసు జారీ తేదీ.28.09.2026.
2.వార్తాపత్రికల్లో మొదటి పునఃప్రచురణ.15.10.2026
3. వార్తాపత్రికల్లో రెండవ పునఃప్రచురణ25.10.2026
4.ఫారం 18లో దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ.
06.11.2026.
5.ముసాయిదా ఓటరు జాబితాల ముద్రణ పూర్తి 20.11.2026.
6.ముసాయిదా ఓటరు జాబితాల ప్రచురణ 25.11.2026.
7.క్లెయిమ్‌లు అభ్యంతరాల దాఖలు 25.11.2026 నుండి 10.12.2026 వరకు. 8. క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం25.12.2026.
9.తుది ఓటరు జాబితా ప్రచురణ 30.12.2026.
జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాట్లాడుతూ పట్టభద్రుల నియోజకవర్గం ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు నిర్ణీత గడువులోగా ఫారం 18 సమర్పించాలని కోరారు. అర్హత కలిగిన పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను సంబంధిత అధికారుల ద్వారా ఎన్నికల సంఘం నిర్దేశించిన విధానంలో సమర్పించాలని ఓటరు జాబితా పునఃసిద్ధీకరణకు సంబంధించి ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ తెలిపారు.