🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 18 September 2026, 10:00 pm Posted by : Telangana Vaartha

బీచుపల్లి ఆంజనేయస్వామి హుండీ ఆదాయం రూ.39.85 లక్షలు

News Image
జోగులాంబ గద్వాల 18 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధిఎర్రవల్లి. మండలం,బీచుపల్లి శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం హుండీ ఆదాయం రూ.39,85,166 వచ్చినట్లు ఆలయ ఈఓ పురేందర్‌కుమార్ తెలిపారు. శుక్రవారం విజయరాయ కల్యాణ మండపంలో దేవాదాయ శాఖ గద్వాల డివిజన్ పరిశీలకురాలు వెంకటేశ్వరి, ఆలయ ఈఓ, సిబ్బంది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గద్వాల శాఖ సిబ్బంది, గద్వాల మహిళా సేవా సమితి సభ్యులు, భక్తుల సమక్షంలో హుండీ లెక్కింపు నిర్వహించారు.205 రోజుల కాలానికి సంబంధించిన హుండీని లెక్కించగా నోట్ల రూపంలో రూ.37,19,705, నాణేల రూపంలో రూ.2,65,461 కలిపి మొత్తం రూ.39,85,166 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. హుండీలో 1.680 కిలోల మిశ్రమ వెండి వచ్చిందని బంగారం మాత్రం లభించలేదని తెలిపారు.
🏠 Home